Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemపవర్ లిఫ్టింగ్ పోటీలను విజయవంతం చేయాలి

పవర్ లిఫ్టింగ్ పోటీలను విజయవంతం చేయాలి

Loading

-పవర్ లిఫ్టింగ్ జిల్లా అసోసియేషన్

భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్, జులై 03

జులై నెల 6, 7 తేదీలలో ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని, ఈ పోటీలను విజయవంతం చేయాలని బుధవారం భద్రాద్రి జిల్లా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులను జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రామిరెడ్డి కోరారు. ఈ క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కార్డును తీసుకొని రావాలని, ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారులకు వసతి సదుపాయ నిమిత్తం జులై 5 సాయంత్రం నుంచి ఖమ్మంలో ఏర్పాటు చేయబడిందని తెలిపారు. అంతేకాకుండా ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయం కలదని వారు తెలిపారు. మరిన్ని వివరములకు జిల్లా ప్రధాన కార్యదర్శి జివి రామిరెడ్డి 9966588688 నంబర్ను సంప్రదించగలరని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page