![]()
-సిపిఐఎం మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, మే 19
మండలంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సిపిఐఎం కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొంది ఉండాలన్నారు. అప్పుడే మనం ప్రజల కష్టసుఖాలను తీర్చగలమన్నారు. సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్యను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు పెద్దిన్ని వేణు, రాయి రాజా, రామడుగు వెంకటాచారి, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, గోగుల తిరుమలయ్య, సభ్యులు దాసరి సీతారాములు, మహిళా సంఘం నాయకురాలు చైతన్ బేగం, అబ్దుల్ రెహమాన్, పోట్రూ భద్రరావు, కాక హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.


