![]()
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుట్టబొమ్మ అమ్మమ్మ చనిపోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ పూజా హెగ్డే తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది.
తన అమ్మమ్మతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ”వుయ్ మిస్ యు అజి’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ బాధాకరమైన ఎమోజీని కూడా పెట్టింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమెను ఓదారుస్తున్నారు.
కాగా..రెండు రోజుల క్రితం పూజా హెగ్డే సిస్టర్ భూమి శెట్టి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళిలో తన ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది పూజ. ఆ సంతోషం ఎక్కువ రోజులు క్యారీ అవ్వకుండానే.. తమతో పాటు.. పెళ్ళిలో సంతోషంగా గడిపిన తన అమ్మమ్మ వెళ్ళిపోవడం.. ఫ్యామిలీని విషాదంలోకి నెట్టేసింది. అంతేకాకుండా ఈ అమ్మడుకి పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటోంది. ఒకప్పుడు సక్సెస్ అందుకున్న పూజా ఇప్పుడు ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది.


