![]()
పూర్తయిన టేకులపల్లి సంత వేలం పాట
- 8 లక్షల 31 వేలు పలికిన టేకులపల్లి సంత వేలం
టేకులపల్లి, మన భద్రాద్రి
టేకులపల్లి మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించు సంత వేలం పాటలో 8 లక్షల 31 వేల రూపాయాలకు మూడ్ వాసు సొంతం చేసుకున్నట్లు మండల పంచాయితీ అధికారి గణేష్ గాంధీ తెలిపారు. శుక్రవారం టేకులపల్లి మండల కేంద్ర గ్రామ పంచాయితీ కార్యాలయంలో టేకులపల్లి, గోలీయాతండా గ్రామ పంచాయితీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంతను 40వారాలకు వేలం పాట కార్యక్రమం ఎంపీవో గణేష్ గాంధీ ఆధ్వర్యంలో ఉదయం 11.30గంటలకు ప్రారంభించారు. తొలుత ఉదయం 10.30 గంటల లోపు 50 వేల రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలనే నిబంధన ప్రకారం ఐదుగురు మాత్రమే డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొన్నారు. రెండు గంటల పాటు సాగిన వేలంను టేకులపల్లి గ్రామ పంచాయితీ మూస్తోండా గ్రామానికి చెందిన మూడ్ వాసు 8 లక్షల 31 వేలకు వేలం పాడి సంత నిర్వహణ బాధ్యత చేజిక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఎంపీవో గణేష్ గాంధీ, స్థానిక ఎంపీటీసీ జాలది అప్పారావు, గ్రామస్తులు ఇస్లావత్ రెడ్డి, భానుచందర్, భూక్య లాలునాయక్, దారవత్ బాలాజీ, భూక్య ఈరు కప, బోడ మంగీలాల్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


