![]()
పేరుకే టీ హబ్…….. పనిచేయని కెమిస్ట్రీ ఎనలైజర్….వివిధ పరీక్షలకు అంతరాయాలు
ఖమ్మం, మన భద్రాద్రి న్యూస్
ఖమ్మం తెలంగాణ డయాగ్నోస్టిక్స్(టీ హబ్)లో వివిధ పరీక్షలకు అంతరాయాలు కలుగుతున్నాయి. టీ హబ్‌లో నెలలో రెండు సార్లు మిషన్లు మొరాయించటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో ఇదే టీ హబ్‌లో కొన్ని పరీక్షలు నిలిపివేయడంతో చాలా మంది రోగులు బయట ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకున్నారు. జిల్లాలో నుంచి వివిధ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సేకరించిన రక్త నమూనాలను ఖమ్మంలో ఉన్న టీ హబ్‌కు పంపిస్తుంటారు. ఇక్కడ పరీక్షలు చేసి రిపోర్టులను ఆన్లైన్ ద్వారా వివిధ హెల్త్ సెంటర్లకు పంపిస్తారు. గతంలో టీ హబ్‌లో 57 రకాల రక్త, మూత్ర పరీక్షలు చేసేవారు. ప్రస్తుతం ఇందులో కొన్ని పరీక్షలను తొలగించారు. ఇక దీనికి కారణం టీ హబ్‌కు వివిధ కంపెనీలు కెమికల్, పరికరాలు సప్లై చేశారు. అయితే ఆ కంపెనీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ కంపెనీలు చేతులెత్తేశాయి. దీంతో కొన్ని పరీక్షలు నిలిపివేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
పనిచేయని కెమిస్ట్రీ ఎనలైజర్..
టీ హబ్‌లో కెమిస్ట్రీ ఎనలైజర్ మిషన్ పనిచేయకపోవడంతో మిషన్ ద్వారా నిర్వహించే వివిధ పరీక్షలు నిలిచిపోయాయి. కిడ్నీ ఫంక్షన్ పరీక్షలు, లివర్ ఫంక్షన్ పరీక్షలు, లిపిడ్ ప్యానెల్, థైరాయిడ్ ఫంక్షన్, ఎలక్ట్రోలైట్లు, ప్రోటీన్లు వంటి వాటిని విశ్లేషించడానికి ఈ మిషన్ పనిచేస్తుంది. ఈ మిషన్ రెండు రోజులుగా పనిచేయకపోవడంతో చాలా ఖర్చుతో కూడిన పరీక్షలు నిలిచిపోయాయి. ఈ మిషన్ యొక్క పరికరం లేకపోవడంతో మిషన్ ఆగినట్టు తెలుస్తోంది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ జరిగే అంతరాయాల పై అధికారులు దృష్టి సారించి అని పరీక్షలు అందుబాటులో ఉంచాలని కోరారు


