![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 01
మండల కేంద్రంలో పోలీస్ సిబ్బంది మరియు జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచులను శనివారం ప్రముఖ వ్యాపారవేత్తలు పట్వారి వెంకన్న, మాడె మంగయ్య ల సహకారంతో ఘనంగా నిర్వహించారు. గుండాల సీఐ ఎల్ రవీందర్ వారి సిబ్బంది మరియు జర్నలిస్టు సభ్యులు మూడు మ్యాచులు ఆడగా రెండు మ్యాచులు హోరాహోరీగా తలపడి చెరో మ్యాచ్ ను గెలుపొందారు. చివరి మూడో మ్యాచ్ లో పోలీస్ జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని, ప్రెస్ మిత్రులతో క్రికెట్ ఆడడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం గెలుపొందిన పోలీస్ జట్టుకు అలాగే ప్రెస్ క్లబ్ జట్టుకు వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు షీల్డ్ లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.


