![]()
-నూతన అధ్యక్షులుగా తోడేటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ఈ నరేష్
ఇల్లందు పట్టణం, మన భద్రాద్రి స్టాఫ్ రిపోర్టర్, జూలై 22
పట్టణంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ప్రగతిశీలా ఆటో అండ్ మోటర్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఐదవ మహాసభలో ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్దన్ సోమవారం ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులుగా తోడేటి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా బొమ్మిడి నాగేష్, ప్రధాన కార్యదర్శిగా ఈ నరేష్, సహాయ కార్యదర్శిగా పాండ్రాల సంతోష్, కోశాధికారిగా
బానోత్ లచ్చిరాం, కార్యవర్గ సభ్యులుగా
డి మోహన్ రావు, మోత్కూరి మల్లికార్జునరావు,
ఎనగంటి రమేష్, కూసు నాగరాజు,
బి కొమరయ్య, ఎడ్ల రవి,
కొర్ర మంగ్ల, పెద్దాపురం సదయ్య, మహంకాళి ఉప్పలయ్య, అల్లి యాకాంబ్రంలను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం మహాసభలో ఆటో అండ్ మోటార్ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, నూతన మోటార్ వెహికల్ చట్టాన్ని, హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, ఆటో మోటార్ కార్మికులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, ప్రభుత్వమే డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నెలకు పన్నెండు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవరుకు ఇవ్వాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, డ్రైవర్లపై వేస్తున్న పెనాల్టీలను, పన్నులను రద్దు చేయాలని, బొగ్గు గనుల వేలం ప్రక్రియను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని తీర్మానాలు చేశామని జనార్ధన్ తెలిపారు.


