Monday, March 23, 2026
HomeTelangana Newsప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తు స్వీకరిస్తున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తు స్వీకరిస్తున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

Loading

ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తు స్వీకరిస్తున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈరోజు టేకులపల్లి మండలం లోని కోయగూడెం గ్రామ పంచాయతీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అన్నారు. పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు దరఖాస్తులు పెట్టనివారు రేపు, ఎల్లుండి కూడా ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తులు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొయ్యగూడెం సర్పంచ్ కోరం ఉమా సురేందర్, ఎంపీటీసీలు, అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page