![]()
-మండల అధ్యక్షుడు శంభు నాయక్
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 10
ఆదివారం టేకులపల్లి మండల భారతీయ జనతా పార్టీ మండలం అధ్యక్షులు తేజావత్ శంభూ నాయక్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం -తిరంగా యాత్ర మండల స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి భూక్య శ్రీను నాయక్ పాల్గోని మాట్లాడుతూ 15 ఆగస్టు నాటికి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలనీ ఈ బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తలు, భూత్ అధ్యక్షులు, సినియర్ నాయకులు, సర్పంచ్, యం పి టి సి, జడ్ పి టి సి అభ్యర్థులు తీసుకోవాలని సూచించారు. భరత ప్రధాన మంత్రి మోడి చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ, మొన్న జరిగిన పహాల్గవ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ మీద మన ఆర్మీ సాధించిన విజయాన్ని గుర్తుకు చేసుకొని ప్రతి ఒక్క పౌరుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా పిలిపునివ్వాలని కార్యకర్తలకు దిశనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో
నియోజకవర్గ నాయకులు వి హతిరం నాయక్, పూన్య నాయక్, రవి రాథోడ్, జిల్లా కన్వినర్ బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నాయకులు ద్రావ్ సింగ్, సత్యం, ఇస్లావత్ రాములు నాయక్, మండల ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, నాగేందర్ నాయక్, మండల నాయకులు ప్రసాద్, రాందాస్, అప్పారావు, అన్వేష్, మూర్తి, రాజు నాయక్, బోడ గంగాబాయి తదితరులు పాల్గొన్నారు.


