![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూన్ 14
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో స్కాలరి షిప్ కోసం పెట్టినటువంటి ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులనై ఎం తేజస్వి, ఎస్ మహేందర్, వి గీతాంజలి, ఎస్ గురుచరణ్ లకు ప్రతినెల 1000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇంటర్ సెకండియర్ వరకు వారికి రానున్నాయి. అట్టి ఎంట్రన్స్ టెస్టులో ప్రతిభ కనిపించిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ ఠాకూర్ రాంసింగ్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం రంగారావు, ఎం మోహన్ రావు, కె రాణి, వి భారతి, జి చందర్ సింగ్, ఎండి మసుద్ అలీ, ఎం రవీందర్, బి సురేష్, పి శేఖర్, జి సీతమ్మ, ఎం బాబురావు, కెవి సత్యనారాయణ, సిహెచ్ లెనిన్ బాబు, సిహెచ్ పద్మావతి, ఉపాధ్యాయులు, తదితరులు విద్యార్థులను అభినందించారు.


