Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemబదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలి

బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలి

Loading

టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు డిమాండ్

ఆళ్లపల్లి, మన భద్రాద్రి బ్యూరో

రాష్ట్ర ప్రభుత్వం బదిలీలతో కూడిన పదోన్నతులు వెంటనే చేపట్టాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలో టీపీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపెయిన్లో వివిధ పాఠశాలలను సందర్శించిన ఆయన ఉపాధ్యాయుల, పాఠశాలల మరియు విద్యార్థుల సమస్యలను సేకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పండిట్, పీఈటీ పోస్టులను వెంటనే అప్గ్రేడ్ చేసి పదోన్నతులు ఇవ్వాలని, కేజీబీవీలలో పని చేస్తున్న సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇచ్చి రెగ్యులర్ చేయాలని, వారి పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీఆర్టీ లను వెంటనే రెగ్యులర్ చేయాలని, వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన నాలుగు పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని, పీఆర్సీ ఫిట్మెంట్ను ప్రకటించి అమలు చేయాలని, ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులు అన్నింటిని క్లియర్ చేయాలని, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలో రెగ్యులర్ పోస్టులను మంజూరు చేయాలని, గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలలో స్కావెంజర్ పోస్టులను మంజూరు చేయాలని, సీపీఎస్ ను రద్దుచేసి ఓపీఎస్ ను అమలు చేయాలని, ఐటీడీఏ భద్రాచలం పరిధిలోని ఉపాధ్యాయుల పెండింగ్ లో ఉన్న రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్లకు సంబంధించిన ఆర్డర్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగ రాంబాబు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు వీరన్న, సోమ్లా, భావ్ సింగ్, నెహ్రూ, రవి, సాంబశివరావు, రామయ్య, శ్రీను, కుమార్ రాజా, రమేష్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page