Tuesday, March 24, 2026
HomeHyderabadబల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

Loading

సంజీవరెడ్డినగర్ భద్రాద్రి వెబ్ డెస్క్: బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ రూ.కోటి విరాళం అందజేశారు.

ఈ మొత్తం బుధవారం దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్‌ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఆలయ ఈవో కృష్ణ వారికి ఆలయ విశిష్టతను వివరించి.. దేవస్థానం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ క్రమంలో ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి వచ్చే వడ్డీని నిత్యాన్నదానం కోసం వినియోగిస్తామని ఆలయ ఇన్‌ఛార్జి ఈవో మహేందర్‌గౌడ్‌ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page