Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemబాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టాలి

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టాలి

Loading

  • సుజాతనగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లాఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

సుజాతనగర్, మన భద్రాద్రి బ్యూరో

ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సుజాతనగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పలు కేసుల వివరాలను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే భాధితులకు సత్వర న్యాయం అందేలా సమగ్ర విచారణ చేపట్టి భాద్యతగా వ్యవహారించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా వర్టికల్స్ వారీగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, సుజాతనగర్ ఎస్సై జుబేదా మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page