![]()
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తప్పిన ప్రమాదం
మన భద్రాద్రి వెబ్ డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi’s Murmu)కు పెను ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా ఇవాళ ద్రౌపది ముర్ము శబిరమల అయ్యప్ప స్వామి దర్శనంతో పాటు హారతీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ మేరకు ఇవాళ ఆమె కొచ్చిలోని ప్రమదం స్టేడియం (Pramadam Stadium)లో హెలికాప్టర్లో ల్యాండ్ కాగా.. ఓ వైపు బురదలో పూర్తిగా కూరుకుపోయింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది హెలికాప్టర్‌ను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద బురద నుంచి పక్కకు నెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప స్పామి దర్శనానికి బయలుదేరారు.


