Tuesday, March 24, 2026
HomeSports Newsబూమ్రా ఒంటరి పోరాటం.. ధీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు..!

బూమ్రా ఒంటరి పోరాటం.. ధీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు..!

Loading

మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్: భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 359/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. 471 పరుగులకు ఆలౌట్ అయింది.

చివరి 7 వికెట్లను భారత్.. 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 209/3 పరుగులతో నిలిచింది. క్రీజులో ఓలీ పోప్ (100), హ్యారీ బ్రూక్ (0)లు ఉన్నారు.అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకేరెండో రోజు ఆటను భారత్ ఘనంగా ప్రారంభించింది. ఓవర్‌నైట్ స్కోరు 359/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. కెప్టెన్ గిల్, రిషభ్ పంత్‌లు రాణించడంతో ఓ దశలో 430/3తో నిలిచింది. దీంతో ఈజీగా 500 పరుగుల మార్కు దాటేలా కనిపించింది. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే గిల్ (147) ఔట్ అయ్యాక.. ఇన్నింగ్స్ గాడి తప్పింది. కేవలం 41 పరుగుల వ్యవధిలోనే భారత్.. చివరి 7 వికెట్లు కోల్పోయింది. దీంతో 500 పరుగుల లోపే అంటే 471 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్, బెన్ స్టోక్స్ నాలుగేసి వికెట్ల చొప్పున తీశారు. బ్రైడన్ కేర్స్, షోయబ్ బషీర్ ఒక్కో వికెట్ తీశారు.బూమ్ బూమ్ బుమ్రాఅనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు.. బుమ్రా రూపంలో ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే బుమ్రా.. జాక్ క్రాలీ (4)ని బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత బెన్ డకెట్ (62), ఓలీ పోప్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రెండో వికెట్‌కు వందకు పైగా పరుగులు జోడించారు. ఈ సమయంలో బుమ్రా మరోసారి వికెట్ పడగొట్టాడు. డకెట్‌ను ఔట్ చేశాడు. అయితే ఓలీ పోప్ మాత్రం వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. వేగంగా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరికొద్ది సేపట్లో ఆట ముగుస్తుందనగా.. బుమ్రా.. రూట్‌ (28)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్రూక్.. 12 బంతులు ఎదుర్కొన్నా పరుగులేమి చేయలేదు. ఔట్ కావొద్దనే లక్ష్యంతో ఆడిన అతడు.. చివరకు అజేయంగా నిలిచాడు.దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. భారత్ స్కోరుకు ఇంకా.. 262 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో ఓలీ పోప్ (100), బ్రూక్ (0)లు ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు తీశాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page