![]()
-బిజీ లైఫులో క్రికెట్టును ఎంజాయ్ చేయండి
మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్, మార్చి 22
ఐపీఎల్ సీజన్ శుక్రవారం నుండి ప్రారంభం కాబోతుంది.రెండు నెలలపాటు నిర్విరామంగా జరిగే ఈ పోరాటంలో ఈ సారి ఐపీఎల్ ట్రోఫీని ఏ జట్టు అందుకోబోతుందో ఆత్రుతగా ఎదురుచూడాల్సిందే.ఇప్పుడున్న బిజీ లైఫ్, మానసిక ఒత్తిడిలో కాస్త ఉపశమనం ఇచ్చేందుకు మాత్రమే ఈ బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ ను ఉపయోగించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.అంతేకాని బెట్టింగులు పెట్టి అప్పులపాలై కుటుంబాన్ని రోడ్డున పడేయకండి అని సూచిస్తున్నారు.10 టీములు తలపడే ఈ టోర్నీలో రెండు నెలలు 74 మ్యాచ్ లు జరగనున్నాయి.


