![]()
- ఏఐటియుసి కెఓసి ఫిట్ సమావేశంలో నాయకులు
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జులై 03
టేకులపల్లి ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునియన్ ఆధ్వర్యంలో కెఓసి నందు ఉదయం షిఫ్ట్ లో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రాంచ్ సహయ కార్యదర్శి కొంగర వేంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా జూలై 5 నుండి12 వరకు దశలవారీగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2015 ఎంఎండిఆర్ చట్టాన్ని మార్చి దేశంలో ఉన్న నూతన బొగ్గు గనులను ప్రభుత్వ రంగాలైన కోలిండియాకు, సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ పరం చేయాడాన్ని వ్యతిరేకంగా తమ పోరాటం ఉదృతం చేస్తూన్నామని, ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కలక్టరేట్ ముట్టడి మరియు 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు స్థానిక జిఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలను చేస్తున్నామని, కార్మికులు అందరూ యునియన్లకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ టిజేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ కృష్ణ, ఫిట్ సహయ కార్యదర్శి బానోత్ బాలాజీ, షెక్ సర్వర్, సామల శ్రీనివాస్, వెంకట నరసయ్య, ఆశోక్, ఇబ్రహీం, నవీన్ కుమార్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.


