![]()
- ప్రకటించిన ఆ దేశ మంత్రి
మన భద్రాద్రి వెబ్ డెస్క్: భారత్-పాక్ ఈ పేర్లు వింటే కాల్పులు, ఉద్రిక్తలే గుర్తుకు వస్తాయి. రెండు దేశాల మధ్య అలజడులు, దాడులతో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంటుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 22న కూడా పాక్ ఉగ్రవాదులు పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిగిన 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. దీనికి ప్రతికారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ వెళ్లి మరీ ఉగ్ర మూకలను మట్టుబెట్టింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం నెలకొంది. ఆ సమయంలో భారత్.. పాకిస్థాన్‌పై కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ దేశస్తులను ఇండియాను విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది. సింధూ నది జలాలను ఆపేసింది. పాక్ వైపు విమానాలు వెళ్లకుండా భారత గగనతలాన్ని మూసివేసింది. వాణిజ్య ఎగుమతులను నిలిపివేసింది. ఎస్-400, డోన్లు, మిస్సైళ్లతో దాడులకు ప్రతి దాడులు చేసింది. దీంతో కాళ్ల బేరానికి వచ్చిన పాక్ సీజ్ ఫైర్‌ను ప్రకటించింది.
అయితే ఆ సమయంలో పాకిస్థాన్‌కు రూ.35 వేల కోట్ల నష్టం జరిగినట్టు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. ఈ నష్టం కేవలం భారత్ తన గగనతలాన్ని మూసేవేయడంతోనే జరిగిందని నివేధించింది. ఈ మేరకు ఆ దేశ మీడియా సంస్థలు ఆ నష్ట వివరాలను వెల్లడించాయి. ఇండియా ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు గగనతలాన్ని మూసివేసిందని, దీని వల్ల రూ.4.10 బిలియన్ డాలర్లు అంటే ఇండియా కరెన్సీలో రూ.35 వేల కోట్ల నష్టం వచ్చినట్టు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. భారత్ ఆంక్షల వల్ల రోజు 100 నుంచి 150 విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని, దీంతో ఫ్లైట్స్ ట్రావెలింగ్ 20 శాతం మేర తగ్గిందని పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి వాటిల్లిన నష్టాన్ని భారత్‌లో రాఖీ పౌర్ణమి రోజే ప్రకటించింది. ఆ దేశ మీడియా కథనాలు ఈ రోజు వెలుబడ్డాయి. దీంతో ఆపరేషన్ సిందూర్ దెబ్బ నుంచి పాకిస్థాన్ ఇప్పట్లో తేరుకునేలా లేదని.. అక్కా తమ్ముడి బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ రోజే పాకిస్థాన్ తన నష్ట జాతకాన్ని ప్రకటించుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మా జోలికి వస్తే ప్రత్యేక్షంగానే కాదు.. పరోక్షంగానూ చావు దెబ్బ కొడతాం అంటూ పోస్టులు చేస్తున్నారు.


