![]()
భారీగా గంజాయి పట్టివేత
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
స్కూటీపై అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని బూర్గంపహాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సీలేరు వైపు నుండి జగ్గయ్యపేట వైపు స్కూటీపై 15 కేజీల సుమారు రూ. 7,65,000/- విలువగల గంజాయి తీసుకెళ్తున్న క్రమంలో సారపాక ప్రధాన కూడలిలో అక్రమంగా స్కూటీపై గంజాయి తరలిస్తూ పోలీసులను చూసి పారిపోతున్న క్రమంలో బైక్ అదుపుతప్పి పడిపోగా వెనకాల కూర్చున్న గూటి నాగరాజు అనే వ్యక్తి పారిపోయాడని, స్కూటీ నడిపే వ్యక్తి జగ్గయ్యపేట మండలానికి చెందిన కన్నెగంటి ఈశ్వర్ గోపీనాథ్ ని పట్టుకొని విచారించగా వారిరువురూ స్కూటీపై సుమారు 15 కేజీల గంజాయి, సుమారు 7 లక్షల 65 వేల రూపాయలు గంజాయిని జగ్గయ్యపేటకు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నాడని, ఇరువురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పారిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అన్నారు.


