Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమంజూరైన క్రికెట్ స్టేడియంను పరిశీలించిన ఎమ్మెల్యే జారే

మంజూరైన క్రికెట్ స్టేడియంను పరిశీలించిన ఎమ్మెల్యే జారే

Loading

అశ్వరావుపేట, మన భద్రాద్రి న్యూస్

అశ్వారావుపేట మండల కేంద్రానికి క్రీడాకారుల సౌకర్యార్థం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా క్రికెట్ ఇండోర్ స్టేడియంను మంజూరు చేసింది. గురువారం పట్టణంలో నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించి స్టేడియంను పలుచోట్ల స్థలాలను పరిశీలించారు. శుక్రవారం అనువైన స్థలాన్ని అధికారులు కేటాయించగా క్రీడాశాఖకు సంబంధించిన సిబ్బందిని తీసుకువెళ్లి స్టేడియం నిర్మాణం కోసం కొలతలు తీయించి, ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నామని, త్వరలోనే పనులు ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page