![]()
మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన
చండ్రుగొండ , మన భద్రాద్రి న్యూస్ , మే 15
కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు డిఆర్డిఏ పిడి విద్యాచందన చండ్రుగొండ మండలంలో పర్యటించారు.మంగయ్య బంజర గ్రామపంచాయతీలో ఫారం ఫండ్ వర్క్ ను,పోకల గూడెం గ్రామపంచాయతీలో అగ్రికల్చర్ రోడ్డు ఫార్మేషన్ వర్క్ నందు కూలీలతో ముచ్చటించారు. అనంతరం ఉపాధి కూలీలకు పలుగు, పార అందజేస్తామని చెబుతూనే పలుగు, పార చేత పెట్టి కూలీలతో పని చేశారు.ఇంకుడు గుంతల నిర్మాణం పరిశీలించారు. రావికంపాడు గ్రామపంచాయతీ నందు పశువుల షెడ్ మరియు మునగ తోటను పరిశీలించారు. రైతుకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ టీం EC రాజు ,ఎంపీడీవో అశోక్ , ఏవో నవీన్ , ఎంపీఓ ఖాన్ , ఏపీవో శ్రీను, సెక్రటరీలు,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.


