![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జులై 04
గుండాల మండల ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ ఆధ్వర్యంలో గురువారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొనిజేటి రోశయ్య 91 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా, 16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మహానుభావుడనీ, ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి, పీడిత ప్రజలకు అండగా నిలిచిన ఆర్యవైశ్యుల మణిరత్నం రోశయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానాల వీరన్న, మానాల ప్రభాకర్, మానాల శ్రావణ్, అయితా నాగ మల్లయ్య, అయితా శ్రీశైలం, శ్రీరంగం శ్రీనివాస్, పాలడుగు భరత్, అయితా పూజిత్, గౌరిశెట్టి శరత్, తౌడిశెట్టి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు


