Tuesday, March 24, 2026
HomeNational Newsమరికాసేపట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం

మరికాసేపట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి.

ఈ సమావేశాలలో 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నవి కాగా, 8 బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంటు భవన సముదాయంలోని ప్రధాన హాల్‌లో పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు, ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరవుతారు. ఉభయసభలు సజావుగా కొనసాగేందుకు సూచనలు తీసుకోవడం, ఉభయసభలలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page