Tuesday, March 24, 2026
HomeTelangana Newsమరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Loading

మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో, జూలై 22

రానున్న రెండు మూడు రోజులలో కూడా వర్షాలు కురవనున్నట్లు ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు సోమవారం వెల్లడించాయి. తెలంగాణలో మరో మూడు రోజులు, ఆంధ్రాలో రెండు రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. పగటి పూటంతా ముసురు వానలు కురుస్తుండంగా, రాత్రిళ్ళు మాత్రం వర్షం దంచికొడుతుంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. మరోవైపు గోదావరి, కృష్ణా నదులు నీటితో ఉదృతంగా ఉరకలెత్తుతున్నాయి. భద్రాచలంలో గోదావరి వద్ద ఆదివారం అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రాలకు తరలి రావాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page