![]()
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 13
బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో గురువారం టాటా మ్యాజిక్ – ద్విచక్ర వాహనం ఢీ కొనగా ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు క్షతగాత్రులను గమనించి, వారిని కారులో ఎక్కించి, ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం పాయం డాక్టర్ కి ఫోన్ చేసి ప్రమాదానికి గురైన ఇద్దరు వ్యక్తులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.


