![]()
మావోయిస్టు పార్టీ కొరియర్ ను అరెస్టు చేసిన చర్ల పోలీసులు
మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవు.. ఏఎస్పి అంకిత్ కుమార్ సంక్వర్
వనం వీడి జనజీవన స్రవంతిలో కలవండి సిఐ ఏ, రాజు వర్మ
చర్ల, మన భద్రాద్రి న్యూస్, జూలై 24:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మంగళవారం నిషేధిత మావోయిస్టు పార్టీ కొరియర్ ను చర్ల పోలీసులు అరెస్టు చేశారు.చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువ వద్ద మంగళవారం మధ్యాహ్నం చర్ల పోలీసులు,స్పెషల్ పార్టీ సిబ్బంది,సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి తప్పించుకొని పారిపోతున్న నిషేధిత మావోయిస్టు పార్టీ కొరియర్గా పనిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని.ఏ ఎస్ పి అంకిత్ కుమార్ సంక్వర్ తెలిపారు.బుధవారం భద్రాచలం ఏఎస్పి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన వివరాలను వెల్లడించారు.పోలీసులు అరెస్టు చేసిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కొరియర్ కారం సమ్మయ్య 35 సం,,రాజబెల్లి కాలనీ,కలివేరు గ్రామపంచాయతీ చర్ల మండలమని. ఇతను గత ఆరు సంవత్సరాల నుండి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి కొరియర్ గా పనిచేస్తున్నాడని తెలిపారు.ఈ క్రమంలో యాంపురం గ్రామానికి వెళ్ళినప్పుడు నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఉయికే కళ్ళు, బి ఎన్ సప్లై టీం కమాండర్ ను కలిసి జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలు ఉన్నందున అటుగా వచ్చే భద్రత బలగాలను చంపాలనే ఉద్దేశంతో, అలాగే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో పేలుడు సామాగ్రిని తీసుకొని రమ్మనగా. అతడు పేలుడు సామాగ్రిని తీసుకొని వెళుతుండగా చర్ల పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో ఇతడు పూజారి కాంకేర్,కోమటిపల్లి ఆర్పిసి మిలీషియా సభ్యులతో పాటు చర్ల ఎల్ఓఎస్ సభ్యులతో కలిసి 2023 జూలై, ఆగస్టు నెలల్లో చర్ల మండలం పూసుగుప్ప అడవి ప్రాంతంలో ప్రెసర్ మైన్స్, వివిధ బాంబులు అమర్చిన ఘటనలో పాల్గొన్నాడని తెలిపారు.
మావోయిస్టు పార్టీకి సహకరిస్తే కఠిన చర్యలు తప్పవు… ఏఎస్పీ
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సహకరించవద్దని,ఒకవేళ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్ తెలిపారు. మావోయిస్టు పార్టీ ప్రజలలో ఆదరణ కోల్పోయిందని, తమ సిద్ధాంతాలు విజయం సాధించలేవని తెలుసుకొని, ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని అనేకమంది మావోయిస్టులు పోలీసు వారి సమక్షంలో లొంగిపోవడం జరుగుతుందని అన్నారు. మావోయిస్టు పార్టీ నుండి బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు తలపెట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని స్వచ్ఛందంగా గాని, బంధుమిత్రుల ద్వారా గాని, తమ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో గాని, పోలీసు ఉన్నతాధికారులను గాని సంప్రదించగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చర్ల సీఐ ఏ, రాజవర్మ, సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అధికారి కమల్ వీర్ యాదవ్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


