Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమావోల మాయమాటలు నమ్మి నిండు జీవితాలను బలి చేసుకోకండి

మావోల మాయమాటలు నమ్మి నిండు జీవితాలను బలి చేసుకోకండి

Loading

-యువతకు సీఐ రవీందర్ హితవు

గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 25

మండలంలోని శెట్టిపల్లి, కోటగడ్డ, సజ్జలబోడు, చింతలపాడు గ్రామాలలో గుండాల సీఐ రవీందర్, గుండాల ఎస్సై సైదా రవూఫ్, కొమరారం ఎస్సై నాగుల్ మీరా లు బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ మండలంలో ఎవరైన అనుమానితులుగా కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం
అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. నిషేదిత మావోయిస్టులకు సహాయ, సహకారాలు అందించి కేసులకు గురికావద్దని హెచ్చరించారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను నమ్ముకుని, తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, జన జీవన స్రవంతిలో కలిస్తే పోలీస్ శాఖ నుంచి ఆపరేషన్ చేయూత ద్వారా ప్రభుత్వం నుండి సహాయ, సహకారాలు అందిస్తామని, తమ కుటుంబాలతో ఆనందంగా జీవించవచ్చని సూచించారు. మావోయిస్టుల మాయమాటలు నమ్మి నిండు జీవితాలను బలి తీసుకోవద్దని యువతకు హితవు పలికారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసి మావోయిస్టులు తమ ఊభిలోకి దించుతూ, వారి స్వలాభం కోసం అమయాకులను బలిగొంటున్నారన్నారు. నిరుద్యోగులకు పోలీస్ శాఖ నుంచి చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు. శెట్టిపల్లి గ్రామంలోని యువతకు వారు వాలీబాల్ కిట్టును అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండాల, కొమరారం పోలీస్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page