![]()
మూడు రోజుల నుండి మూగబోయిన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు
కరకగూడెం, మన భద్రాద్రి న్యూస్, మార్చి 14
కరకగూడెం మండల పరిధిలోని రక్షక బటుల ప్రాంగణంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ గత మూడు రోజుల నుంచి రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల తమ రోజువారి పనులకు ఆటంకం కలుగుతుందని పలువురు వ్యాపారస్తులు, స్థానికులు వాపోతున్నారు. వెంటనే సంబంధిత స్పందించి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మరమ్మత్తులు చేయాలని గ్రామస్తులు, వ్యాపారస్తులు కోరుతున్నారు.



