Tuesday, March 24, 2026
HomeHyderabadయూట్యూబర్ ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్

యూట్యూబర్ ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్

Loading

  • ప్రజలకు తెలంగాణ పోలీసుల కీలక సూచన

హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్

తండ్రీ, కుమార్తె బంధంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు నాంపల్లి కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా ప్రజలకు తెలంగాణ పోలీసులు కీలక సూచన చేశారు. సోషల్ మీడియాలో, ఇతర డిజిటల్ వేదికల్లో అసభ్యకరమైన, విద్వేషకరమైన వ్యాఖ్యలు జైలు గోడల మధ్య బందీకి దారి తీస్తాయని హెచ్చరించారు. సమాజంలో స్నేహపూర్వక వాతావరణానికి ఇబ్బంది కలిగించకుండా మనుషులమనే విచక్షణతో ప్రవర్తించాలని కోరారు. సోషల్ మీడియాలో మీ కుటుంబ వ్యక్తిగత ఫొటోలు పోస్ట్ చేయకండి అంటూ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page