Tuesday, March 24, 2026
HomeAndhra Pradeshయోగాసనాలు వేసిన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు

యోగాసనాలు వేసిన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు

Loading

విశాఖ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఆధ్వర్యంలో విశాఖపట్నం (Vishakhapatnam) వేదికగా ఆర్కే బీచ్‌లో ‘యోగాంధ్ర’ (Yogandhra) కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రముఖుల ప్రసంగాల అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్ సాధారణ ప్రజలతో మమేకమై యోగాసనాలు వేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ..యోగా డే పోస్టల్‌ స్టాంప్‌ను కూడా ఆవిష్కరించారు. ఉదయం 4 గంటల నుంచే విశాఖ తీరానిని ప్రజల రాక మొదలైంది. ఉదయం 5.45 గంటలకు వరకు యోగా సాధనకు వచ్చిన వారి సంఖ్య 1.50 లక్షలు దాటింది. యోగాంధ్రా ప్రాంగణంలో క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసుకున్న వారిని మాత్రమే అధికారులు లెక్కిస్తున్నారు. 8 గంటల వరకు సుమారు 3 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమానికి హాజరైనట్లుగా అధికారులు వెల్లడించారు. దీంతో సూరత్‌లో 1,47,952 మందితో చేసిన యోగా రికార్డును యోగాంధ్ర బద్దలుకొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page