![]()
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, మే 19
మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం గ్రామం గాంధీ భవన్ టీపీసీసీ కో – ఆర్డినేటర్ వార్ రూమ్ ఇంఛార్జ్ బోలిశెట్టి భాస్కర్ తల్లి రాములమ్మ కొద్దిరోజుల క్రితం మరణించారు. విషయం తెలుసుకున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదివారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో
మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


