![]()
రాములోరి కళ్యాణానికి రండి… వైరా ఎమ్మెల్యే కు దేవస్థాన వైదిక పెద్దలు ఆహ్వానం
భద్రాచలం లో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 12 వరకు నిర్వహించే శ్రీరామ నవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు రావాలని రామాలయ వైదిక పెద్దలు హైదరాబాద్ అసెంబ్లీ నందు మర్యాదపూర్వకంగా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ని కలిసి ఆశీర్వచనం అందించి, రాములోరి కళ్యాణానికి రావాలని ఆహ్వానం పలికారు. ముఖ్యంగా ఏప్రిల్ 5,6,7 న జరిగే నవమి వేడుకలకు రావాలని కోరారు.


