![]()
భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు దిగిన పాకిస్తాన్ కు భారత్ గట్టిగా బదులిచ్చింది(Inida Pakista War). శుక్రవారం అర్థరాత్రి దాటాక పాకిస్తాన్‌లోని రావల్పిండి(Ravalpidi) సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్(Noor Khan Airbase Attack)పై మిస్సైల్ దాడికి దిగింది. చక్లాలా ప్రాంతంలో ఉన్న ఈ ఎయిర్‌బేస్ వద్ద రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. దాడి తర్వాత ఈ ప్రాంతాన్ని పాక్ భద్రతా బలగాలు మూసివేసి, దర్యాప్తు ప్రారంభించాయి.ఇప్పటి వరకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడిలో ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు అధికారికంగా తెలియలేదు.
కాగా పాకిస్తాన్(Pakistan) శుక్రవారం సాయత్రం జమ్ము కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని 26 చోట్ల డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్ వరకు LOC వెంట.. సాధారణ పౌరులను, సైనిక స్థావరాల లక్ష్యంగా పాక్ ఈ దాడులు జరిపింది. భారత ఆర్మీ వాటిని ధీటుగా తిప్పి కొట్టడంతోపాటు.. రావల్పిండి ఎయిర్ బేస్ పై మిసైల్ దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది.


