![]()
-మండల కాంగ్రెస్ నాయకుల విమర్శ
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 09
మండల కేంద్రంలో ఆదివారం మండల కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఏఎంసీ డైరెక్టర్ ఊకె బుచ్చయ్య శనివారం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అభివృద్ధి గురుంచి మీరే మాట్లాడాలని, కాంగ్రెస్ పార్టీపై అలాగే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లపై గుండాల పర్యటనకు వచ్చి మీరు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. గతంలో పాయం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమలు చేయించిన అభివృద్ధి పనులను మీరు చేయించినట్లుగా బిల్డ్ అప్ ఇచ్చిన మీరు అభివృద్ధి గురుంచి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అవి కూడా శిలా ఫలకాల మీద పేర్ల కోసం, ఫోటో ఫోజుల కోసం మరియు కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్ల కోసం చేశారని, ఆ విషయం కూడా నియోజకవర్గ ప్రజలందరికి తెలుసునని ఎద్దేవా చేశారు. ఒక్క రూపాయి కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం మండలంలో వేయలేదనడం మీ అజ్ఞానానికి రుజువని, త్వరలో స్థానిక ఎన్నికలు అని ప్రకటన రాగానే ఇప్పుడు మీకు మండల ప్రజలు గుర్తొచ్చి, ప్రెస్స్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. రైతు భరోసా ఇవ్వడం ఆలస్యం కావచ్చు కానీ అది కూడా ప్రజల ముందు బహిరంగంగానే ఒప్పుకునే విధేయత కలిగిన ప్రభుత్వం మాదని, అలాంటి ప్రభుత్వం గురుంచి నోటికొచ్చినట్లు మీరు మాట్లాడినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. మీ నాయకత్వంపై అంత నమ్మకం ఉన్న మీరు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎందుకు పోటీచేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని డిపార్ట్మెంట్ వారు వారి వారి డిమాండ్స్ కోసం రోడ్లు ఎక్కితే వారిని అక్రమ అరెస్టులు చేశారని, ఎవరెన్ని చెప్పినా ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మీ మీద ఉన్న ఆ కొంత గౌరవాన్ని కూడా కోల్పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పాయం గణేష్, ఎస్కే ఖాసీం, ఎస్కే వాజీద్, పల్లపు రాజేష్, బొంగు చంద్రశేఖర్, బొర్ర వెంకటేశ్వర్లు, నూనావత్ రవి, బొర్రయ్య, రంగయ్య, తదితరులు పాల్గొన్నారు.


