![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, మే 29
మండలంలో రైతులకు వ్యవసాయ అధికారి బుధవారం జీలుగుల విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు సరిపడా విత్తన బస్తాలు రాలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 300 మందికి పైగా రైతులు వస్తే 90 మందికే బస్తాలు ఉన్నాయని, రెండు రోజుల తర్వాత వస్తాయని వ్యవసాయ అధికారి హామీ ఇవ్వడంతో చాలామంది రైతులు నిరాశతో వెనుతిరిగారు. సంబంధిత అధికారిని వివరణ కోరగా ప్రభుత్వం ఇచ్చిన వరకే మేము అందిస్తున్నామని, రెండు రోజుల్లో సరిపడా వస్తాయని తెలిపారు.


