Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemరైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనే పరిస్థితి ఉందా..?

రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనే పరిస్థితి ఉందా..?

Loading

రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనే పరిస్థితి ఉందా?

  • – అయోమయ స్థితిలో అన్నదాతలు

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 29

చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి పంట సాగు చేశారు. ధాన్యం చేతికి వచ్చేసరికి ప్రభుత్వం ప్రకటించిన రేటు ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కానీ చండ్రగొండ మండల వ్యవసాయ అధికారులు మాత్రం గ్రామంలోని వరి ధాన్యాన్ని కొనడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో రైతులకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం తేమ 17% ఉండాలని మార్కు చేస్తే 9% వచ్చినా కూడా కొనడానికి నిరాకరిస్తున్నారు. ప్రైవేట్ దళారులు మాత్రం ఇదే అదునుగా చేసుకొని మార్కెట్ రేటు కన్నా చాలా తక్కువగా కొని రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. 15 రోజులుగా రైతులు ఎదురుచూసి చూసి ఈ ప్రభుత్వం ఇక కొనలేదని తెలుసుకొని, వాతావరణం కూడా అనుకూలిస్తుందో అనుకూలించదో అనే భయంతో ప్రైవేట్ దళారులకు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. దీనివల్ల రైతులు ఎంతగా నష్టపోతున్నారు ప్రభుత్వానికి తెలియడం లేదా, పైకి రైతే రాజు అని చెప్పడమే గాని రైతును రాజు చేయడం పక్కన పెడితే రైతులు ఆత్మ చేసుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయని రైతులు మండిపడుతున్నారు. మండల వ్యవసాయ అధికారులు ప్రైవేటు దళారులతో చేతులు కలుపుకొని ఇదంతా చేస్తున్నారేమోనని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టకపోవడంతో నేను గత నాలుగు రోజుల క్రితమే ప్రైవేటు దళారులకు తక్కువ రేటుకే అమ్మడం జరిగిందని కుక్కల రంగయ్య రావికంపాడు గ్రామస్థుడు ఆవేదన వ్యక్తం చేయగా, మండల వ్యవసాయ అధికారికి గత నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా కానీ ఎటువంటి స్పందన లేదని, నా ధాన్యాన్ని నేను ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని నిజాంపట్నం వీరభద్రం అనే ఇంకొక రైతు తన బాధను వ్యక్తపరిచాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page