Wednesday, March 25, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemరోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర నూతన కార్యవర్గం ఎన్నిక

రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర నూతన కార్యవర్గం ఎన్నిక

Loading

రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర నూతన కార్యవర్గం ఎన్నిక

  • నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన డిస్టిక్ గవర్నర్
  • ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేత

బూర్గంపహాడ్, మన భద్రాద్రి బ్యూరో, జులై 21

ఐటీసీ అనుబంధ సంస్థ అయిన రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర, సారపాక వారి 28వ ఇన్స్టాలేషన్ కార్యక్రమం కళాభారతీ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యూనిట్ హెడ్ ప్రణవ్ శర్మ అధ్యక్షత వహించారు. ఇన్స్టాలేషన్ అధికారి డిస్ట్రిక్ట్ 3150 ప్రస్తుత గవర్నర్ శరత్ చౌదరి విచ్చేసారు. గవర్నర్ ఈ సంవత్సర కార్యవర్గ ప్రెసిడెంట్ డి.వి.ఎమ్. నాయుడు, సెక్రటరీ వి. సాయిరామ్, ఇతర కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. గత సంవత్సరం ఈ క్లబ్ చేసిన సేవలను కెవిఎస్ గోవిందరావు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా గవర్నర్ కి చూపించడం జరిగింది. గవర్నర్ గత సంవత్సరం క్లబ్ చేసిన సేవలను కొనియాడారు. ప్రస్తుత సంవత్సర కార్యవర్గానికి మరిన్ని మంచి కార్యక్రమాలను చేయాలని దిశా నిర్దేశం చేశారు.

తన సహయం క్లబ్ కు ఎల్లప్పుడూ ఉంటుందని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతిలో మంచి ప్రతిభ కనబర్చిన సారపాక పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థినులకు స్కాలర్ షిప్లు అందజేశారు. మొత్తం 27 మంది విద్యార్థినులు స్కాలర్ షిప్లు అందుకున్నారు. ఇదే వేదిక మీద రోటరాక్ట్ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ అరవింద్, సెక్రటరీ చైతన్య, ఇతర కార్యవర్గ సభ్యులచే డిస్టిక్ట్ రోటరాక్ట్ రిప్రజంటేటివ్ అశోక్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి రోటరీక్లబ్ డిస్ట్రిక్ 3150 పూర్వ గవర్నర్లు బి.శంకర్ రెడ్డి, మల్లాది వాసుదేవ్, డిప్యుటీ గవర్నర్ డి. సాంబశివరావు, అసిస్టెంట్ గవర్నర్ పి.భూషన్ రావు, రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా పూర్వ ప్రెసిడెంట్ పీఎస్ భాస్కర రావు, పి.బి. నిరంజన్, శ్యామ్ కిరణ్, రాజశేఖర్ , చెంగల్ రావు, చాంద్ భాషా, ప్రఫుల్ కుమార్, ప్రజాప్, నవీన్, రంజిత్ కుమార్, డేవిడ్ అతివర్, భద్రాచలం మహిళా సమితి సభ్యులు రేష్మా శర్మ, ఆత్మ, మాధవి నాయుడు, కామేశ్వరి, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అంజుష వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గుత్తేదారులు పాకాల దుర్గాప్రసాద్, యు.వి.రావు, జలగం చంద్రశేఖర్, మహేష్ రెడ్డి, యేసోబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. రోటరాక్ట్ క్లబ్ తరుపున నీలి మురళి, అరుణ్ సాయి, దీపక్, ప్రవీణ్, ఉమా మహేశ్వరి, రబీబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page