![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జనవరి 26
మండల పరిధిలోని లింగగూడెం గ్రామపంచాయతీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలన పథకాలను ఆదివారం పొంగులేటి – పాయం యువసేన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, అధికారులు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైతు భరోసా 1140 మంది లబ్ధిదారులకు సుమారు రెండు కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 38 మంది లబ్ధిదారులు, 25 కొత్త రేషన్ కార్డులు అలాగే ఇందిరమ్మ ఇల్లు 152 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఆర్ – పీవీఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికి పథకం అందజేసే బాధ్యత అధికారులపై ఉందని, జాబితాలో పేరు రాలేదని ఎవరూ కంగారు పడొద్దని, ఇది నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకోని వారు ఉంటే మండల కార్యాలయానికి వెళ్లి చేసుకోవచ్చని, విడతల వారిగా పథకాలు అమలవుతాయని ప్రజలకు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఈ మహోత్తర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, పేదలకు అండగా నిలబడుతుందని, అర్హులైన ప్రతీ ఒక్క కుటుంబానికి ఈ పథకాలు అందుతాయని, ప్రజలు ఎప్పుడు ఇలాగే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పీఎస్ఆర్ – పీవీఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ మండల కో – ఆర్డినేటర్ ఎస్కే ఖధీర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దార అశోక్, ఏఎంసీ డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, రోళ్లగడ్డ మాజీ సర్పంచ్ అజ్మీర మోహన్, ముత్తాపురం మాజీ ఉప సర్పంచ్ మోకాళ్ళ శంకర్, సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య, మైనారిటీ సంఘం ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఎస్కే వాజీద్, పాయం గణేష్, సుతారి చంటి, బొంగు చంద్రశేఖర్, జర్పుల సక్రు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


