Tuesday, March 24, 2026
HomeTelangana Newsలయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ కిన్నెరసాని ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ కిన్నెరసాని ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Loading

లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ కిన్నెరసాని ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

ములకలపల్లి, మన భద్రాద్రి న్యూస్

ములకలపల్లి మండలం, ములకలపల్లి గ్రామంలో గురువారం రోజున ఆదివాసి గిరిజన విద్యాలయం అయిన శిశు మందిర్ ఆవాస పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ కిన్నెరసాని ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు లయన్ కేదారేశ్వర రావు నేతృత్వంలో పాఠశాల విద్యార్థులు మొత్తం 135 మందికి 10 మంది సిబ్బందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు లయన్ కేదారేశ్వర రావు మాట్లాడుతూ ఆవాస గిరిజన పాఠశాల అయిన శిశు మందిర్ లో అనేకమంది పేద విద్యార్థులు విద్యాభ్యాసం చేయుచున్నారు. వారందరికీ ఒక పూట కడుపునిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.

క్లబ్ అధ్యక్షుడు లయన్ కేదారేశ్వర రావు కుమారుడి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని వారికి అన్నదానాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ లయన్ రేపాక ప్రసాదరావు, పాఠశాల ప్రధానాచార్యులు మరియు క్లబ్ సభ్యులు లయన్ కుంజ జగన్, లయన్ తానం శ్రీనివాసరావు, కుంజా రాజారావు, మడకం మణికంఠ, కొండ్రు జంపన్న, మడకం ఉమేష్ కుమార్, అరవింద్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page