![]()
వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎంపిడిఓ జమలా రెడ్డి
అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు
క్రితం వచ్చిన వరదల్లో ఇఓ మహేష్ పాత్ర అభినందనీయం
రాజకీయాలకు అతీతంగా నాయకులు,యువకులు సహాయ కార్యక్రమాలు చేపట్టాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలోని గోదావరి పరివాహక ముంపునకు గురయ్యే ప్రాంతాలను మండల ఎంపిడిఓజమాల్ రెడ్డి, సారపాక ఇఓ మహేశ్ పరిశీలించారు . ప్రజలు అప్రమత్తంగా వుండాలని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు .స్థానిక అఖిలపక్ష నాయకులు ,యువకులు ఇటువంటి ఆపత్కాలంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే క్రితం వచ్చిన వరదల్లో సారపాక ఇఓ మహేష్ ముందస్తు చర్యలు చేపట్టి ఎటువంటి ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకున్నారని, అలాగే ఇప్పుడు కూడా ముందుండి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇఓ మహేష్, మారం వెంకటేశ్వరరెడ్డి, పులపెల్లి సుధాకరరెడ్డి, కర్రి రాజేంద్ర ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


