Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవిద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ విజయవంతం

విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ విజయవంతం

Loading

గుండాల, మన భద్రాద్రి న్యూస్, జులై 04

మండల కేంద్రంలో వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన బంద్ విజయవంతమైందని,
నీట్ మరియు నెట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీలను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ లో భాగంగా గుండాల మండల వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే షాహిద్ తెలిపారు. ఈ సందర్భంగా షాహిద్, పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ నరేందర్, పీడీఎస్యూ జిల్లా నాయకులు భాస్కర్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి పర్షిక రవి, పీవైఎల్ మండల కార్యదర్శి మంగయ్యలు మాట్లాడుతూ నీట్ మరియు నెట్ పరీక్ష పేపర్ల లికేజ్ వలన నష్టపోయి ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు పూర్తి స్థాయి భరోసా కల్పించడంలో కేంద్రంలోని నరేంద్ర మోధీ ప్రభుత్వం విఫలమైందని యునైటెడ్ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాసిన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర ప్రభుత్వామే బాధ్యత వహించాలని, పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిచే సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, పేపర్ లీకేజీ వలన నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్ టీ ఏ ను రద్దు చేయాలని, పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోధీ ప్రభుత్వం దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి ఎస్కే నాసిర్, పీడీఎస్యూ మండల నాయకులు వినయ్, పీవైఎల్ జిల్లా నాయకులు సుగుణారావు, కృష్ణ, సాంబశివరావు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page