Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవిద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి

విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి

Loading

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జులై 03

ఈరోజు టేకులపల్లి లోని మహాత్మా గాంధీ జ్యోతి బాపూలే బాలుర గురుకుల పాఠశాలలో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించి స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ చే పిల్లల్ని పరీక్షించి తగిన చికిత్సను అందించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకు వైద్య పరమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం చిన్న వయస్సు నుంచి అలవర్చుకోవాలని, మిగిలిపోయిన అన్నం ఆహార పదార్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయడం ద్వారా ఈగలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యర్ధాలను డస్ట్ బిన్ లో వేయడం అలవర్చుకోవాలని, ముఖ్యంగా ఆహారం తీసుకోవడానికి ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు అత్యంత పరిశుభ్రంగా కడుక్కోవాలని, వదులుగా ఉన్న బట్టలు ధరించాలని, తడిగా ఉన్న బట్టలు ధరించకూడదని, క్లోరినేషన్ చేసిన నీటిని వాడుకోవడం ద్వారా చర్మవ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాపిడి రవీందర్, ఉపాధ్యాయులు చైతన్య, మాధురి, ఆరోగ్య విస్తరణ అధికారి దేవా, స్టాఫ్ నర్స్ రేష్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page