![]()
-విద్యుత్ షాకుతో ప్రాణాలు పోయే వరకు వేచి చూస్తారా
-రైతుల ఆవేదన
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 11
చండ్రుగొండ – రావికంపాడు మధ్యలో గల వ్యవసాయ భూమిలో త్రీఫేస్ కరెంట్ వైర్లు గత రెండు సంవత్సరాల నుంచి క్రిందికి వేలాడుతూ, చేతికి తగిలేలా ఉన్నాయని అన్నదాతలు వాపోతున్నారు. పశువులు కూడా ఆ వైర్ల క్రింద నుండి వెళ్తుంటే తగిలేలా ఉన్నాయని, రైతులు ఎన్నిసార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించుకున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోతేనే అధికారులు స్పందిస్తారా లేదా ఏదైనా ప్రమాదం జరిగితేనే విద్యుత్ అధికారులు స్పందిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా పెద్ద .ప్రమాదం జరగముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఈ త్రీఫేస్ లైను స్తంభాలు చాలా ఒరిగి ఉన్నాయని, ఈ లైన్ కు మరమ్మత్తులు పూర్తి చేసి రైతుల ప్రాణాలు కాపాడాలని రావికంపాడు గ్రామస్థులు విద్యుత్ అధికారులు వేడుకుంటున్నారు.



