![]()
కరకగూడెం, మన భద్రాద్రి న్యూస్, మే 17
మినీ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఎర్త్ వైర్ కు విద్యుత్ ప్రవహించడంతో దానిని తాకి శుక్రవారం ఒక మూగ జీవి ప్రాణాలు విడిచిన సంఘటన మండలంలోని కలవల నాగారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇస్లావత్ రాధాకృష్ణ అనే రైతుకు చెందిన దుక్కిటెద్దు విద్యుత్ షార్టుసర్కిట్ వలన మృతి చెందింది. మృతి చెందిన దుక్కిటెద్దు విలువ సుమారు రూ. 40 వేలు ఉంటుందని రైతు తెలిపాడు. విద్యుత్ శాఖ అధికారులు ఇకనైనా స్పందించి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మూగ జీవిని కోల్పోయి నష్టపోయిన రైతుకు నష్టపరిహారం చెల్లించి, విధి నిర్వహణలో తూతూమంత్రంగా కార్యాకలాపాలను నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ అధికారులపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.


