Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవిద్య సంస్థల బంద్ కు సహకరించాలి

విద్య సంస్థల బంద్ కు సహకరించాలి

Loading

-ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షులు

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 04

మండలంలో బుధవారం జరిగిన విద్యాసంస్థల బందుకు మండల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఎస్కే వసీమ్ పాషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 6 న నీట్ కౌన్సిలింగ్ జరిపే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, పేపర్ అమ్ముకోవడంపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం దారుణమని అన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలపై నమ్మకం లేకుండా పోతుందని ఆరోపించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అమ్ముకోవడంపై సాక్ష్యాలు ఉన్నా, నిజమని తేలినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. జులై 6 న కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మొండిగా వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి, మళ్ళీ నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సంస్థను వెంటనే రద్దు చేయాలని,
24 లక్షల మంది నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు నాయ్యం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి కూడా 70 వేలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినా కూడా స్పందించకపోవడంతో ఆయన ఇంటిని ముట్టడించామని తెలిపారు. తెలంగాణాలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీల ఇండ్లను ముట్టదించామని, స్టూడెంట్ మార్చ్ నిర్వహించామని, సిగ్నిచర్ కాంపెయిన్ చేశామని, ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మోధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశామని, గవర్నర్ కి నీట్ విద్యార్థుల పక్షాన రిప్రెసెంటేషన్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదని అందుకే రాజ్ భవన్ ముట్టడి చేశామని పేర్కొన్నారు. అందుకే బుధవారం భారత్ బంద్ కి అన్ని పక్షాలు కలిసి పిలుపునిచ్చాయని, ఇందులో భాగంగా తెలంగాణాలో కూడా అన్ని విద్యార్థి సంఘాల అధ్వర్యంలో బంద్ ను సక్సెస్ చేస్తామని అన్నారు. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది తరుపున అందరూ నిలవాలని, కొత్త చట్టాలను తీసుకుని రావడం కాదు వాటిని సమర్ధవంతంగా అమలు చేయాలని సూచించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page