![]()
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, మే 17
మండలంలోని డీవీ రాయల్ ఫంక్షన్ హాల్లో దొబ్బల వెంకటప్పయ్య – లక్ష్మి దంపతుల 50 వ పెళ్లిరోజు వేడుకలో శుక్రవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని, వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, మండల టౌన్ అధ్యక్షులు శివసైదులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


