Friday, March 27, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవేలంలో గణేష్ లడ్డు గెల్చుకున్న ముస్లిం కుటుంబం

వేలంలో గణేష్ లడ్డు గెల్చుకున్న ముస్లిం కుటుంబం

Loading

వేలంలో గణేష్ లడ్డు గెల్చుకున్న ముస్లిం కుటుంబం

మతసామరస్యకు ప్రతీక అంటూ పలువురు ప్రశంసలు.

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 06

దేశంలో ప్రస్తుతం ప్రతి ఒక్క చోట కూడా వినాయక నిమజ్జనం ఎంతో భక్తి భావనలతో చేస్తున్నారు. అయితే.చాలా చోట్ల లడ్డును వేలంపాటను_ నిర్వహిస్తున్నారు.. అందులో భాగంగా నేడు ఇల్లందు పట్టణంలోని R & R కాలనీ 12 వ వార్డు 6వ లైన్లో పరశురాం యూత్ కమిటీ వారు ఏర్పాటు చేసిన గణనాధుడినీ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించార కార్యక్రమంలో ఇల్లందు పట్టణ మాజీ అధ్యక్షులు సిలివేరి సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు లడ్డువేలంని నిర్వహించారు. ఈ వేలం పాటలో ఆసక్తి కర ఘటన వెలుగు చూసింది. వేలం పాటలో.స్థానికులతో పాటు ముస్లిం కుటుంబం కూడా ఈ వేలంపాటలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఇమామ్ 49వేల16లకి వేలం పాట పాడి లడ్డును దక్కించుకున్నాడు. ముస్లిం బాలుడు గణేష్ లడ్డూని దక్కించుకోవడంతో అక్కడి వారు మతసామరస్యానికి ప్రతిక అంటూ కూడా పొంగిపోతున్నారు. కులమతాలకు అతీతంగా ఐక్యతను చాటిన ఇమామ్ ను కాలనీవాసులు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్ పాసి, శేఖర్, బన్సీ, సందీప్, అజయ్,కపిల్ బాలకిషన్ కళ్యాణ్ ఊర్మిళా భాయ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page