Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవ్యక్తిని హత్య చేసిన దుండగులు

వ్యక్తిని హత్య చేసిన దుండగులు

Loading

కర్రలు,కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు…

చర్ల,మన భద్రాద్రి న్యూస్, జూలై 24 : ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన మండల పరిధిలోని రాజయ్య నగర్ లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం మండల పరిధిలోని రాజయ్య నగర్ లో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మడవి భద్రయ్య (45) అనే గిరిజనుడు ఎప్పటిలాగానే బుధవారం కూలి పనులు చేసుకుని ఇంటికి వచ్చింది నిద్రిస్తున్న సమయంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు భద్రయ్య ఇంటిలోకి వచ్చి కర్రలతో కత్తులతో దాడి చేసి పొడిచి చంపారని తెలిపారు. ఆ సమయంలో అడ్డు వచ్చిన భార్య లక్ష్మి,కుమార్తెను కొట్టారని, భయభ్రాంతులకు గురైన భార్యా పిల్లలు కేకలు వేయడంతో గుండగులు అక్కడి నుండి పరారయ్యారని, భద్రయ్య కుటుంబ సభ్యులు కేకలు విన్న గ్రామస్తులు రక్తపు మడుగులో పడి ఉన్న భద్రయ్యను చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం అక్కడినుండి భద్రాచలం ప్రభుత్వ వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. హత్య విషయాన్నీ తెలుసుకున్న చర్ల సిఐ ఏ,రాజు వర్మ, ఎస్సై ఆర్ నర్సిరెడ్డి తమ సిబ్బందితో సంఘటన ప్రాంతానికి వెళ్లి కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page