![]()
అశ్వారావుపేట, మన భద్రాద్రి న్యూస్, జూలై 04
అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాములు శ్రీనివాస్ గత మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం పాఠకులకు విధితమే. ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా వివరాలు ఇంకా తెలియలేదని, ఎస్సైగా వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజాదారణ పొందుతూ సేవలందిస్తున్న ఒక దళిత ఎస్సైపై కక్ష సాధింపు చర్యగా వేధింపులు చేయడం చాలా బాధాకరమని, దళిత ఎస్సైపై ఉన్నతాధికారుల వేధింపులా లేక తోటి సిబ్బంది వేధింపుల వల్లనా ఎస్సై ఆత్మహత్య చేసుకున్నరా అని తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి, బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఆ వ్యక్తులను విధుల నుంచి తొలగించాలని గురువారం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నియోజకవర్గ ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్ చేసారు. లేనిపక్షంలో అన్ని సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.


