Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemసంతాప సభ ను జయప్రదం చేయండి

సంతాప సభ ను జయప్రదం చేయండి

Loading

సంతాప సభ ను జయప్రదం చేయండి

జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్, జులై 23

ఇటీవల కాలంలో అకాల మృతి చెందిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ రాయల చంద్రశేఖర్ సంతాప సభను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు బానోత్ ధర్మ లు కోరారు. మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఈనెల 28న ఖమ్మంలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంతాప సభ గోడపత్రికలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంతాప సభలో పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్, రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ,కె.జి. రామ్ చందర్, కెచ్చల రంగయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, జి. వెంకటేశ్వరావు, చిన్న చంద్రన్న, ప్రభాకర్, కృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సంతాప సభలో పార్టీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు రాయల సిద్దు, మంన్డ్రాజుల కృష్ణయ్య, కల్లోజి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page